![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj6dj2AQ5M8nVs4LpbM3zZgi4ej_9ANrN6oKKxurVN4UGu-3M4jgfHMMHBuug2G_3Q6Hzm5QyeXpDfUxRDIKccN8KP7hSqUbUT40GQTplPs9YHSrLyKq1JXI0vZZ3IJBx1FtnvAbgXL_iNm/s400/4GBQI5CAJ3UOEECARCYLAVCAH22J9HCAY4GES0CA0H47HVCAEBQ1SYCAACMH2PCAVC8TNFCAV4ILRPCAQZWHW4CAYBZ5E2CAR6QYL7CAEX3EO2CA2Q0F71CA4M680FCAH9YPSJCAONHXL0CAKJQVMP.jpg)
శరత్ పూర్ణిమలా నాటి జాబిలమ్మ
కొద్ది కొద్దిగా కనిపిస్తే
నీ తొలిచూపు జ్ఞాపకం…!
నీరెండ పడి లేత ఆకు మీద
మంచు బిందువు తళుక్కున
మెరిస్తేనీ నవ్వు జ్ఞాపకం….!
అల్లరి తుమ్మెద అలవోకగా
పువ్వుపై వాలితే
నీ ముద్దు జ్ఞాపకం….!
సంధ్యకాల పిల్లగాలి
హాయిగొలిపితే
నీ స్పర్శ జ్ఞాపకం…!
పాలబుగ్గల పసివాడు
అమ్మవొడిలో ముద్దుగా ఒదిగితే
నీ ప్రేమ జ్ఞాపకం….!
No comments:
Post a Comment