జుట్టు విరబోసుకుని తిరగడం నేడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. అయితే మన ఆచార, సాంప్రదాయాల ప్రకారం జుట్టు విరబోసుకోకూడదు. జుట్టు ముడివేసుకుని సువాసన గల పూలు ధరించడం పుని స్త్రీల ఆచారం. పువ్వులకు సుమనస్సులు అని పేరు. వాటి సువాసన వలన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అసలు వెంట్రుకలు, గోళ్లు మన పాపాలకు ప్రతీకలు. అందుకే శ్రీ వేంకటేశ్వర స్వామికి తల నీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటాం. సహజంగా స్త్రీలలో ఏదేని విషయం పట్ల పట్టుదల పెరిగితే జుట్టు ముడి వేసుకోమని పట్టుపడతారు. ద్రౌపది, దుశ్శాసనుడు తన జుట్టుపట్టుకు గుంజాడన్న రోషంతో ద్రౌపది ఆనాడు జుట్టు విరబోసుకుంది. కనుక అట్టి కార్యాన్ని రోజువారి చేయకూడదంటోంది శాస్త్రం.గంగానది పుణ్య నదులలో స్నానం చేసే ముందు స్త్రీలు, పురుషులు తమ జుట్టు, గోళ్లు తీయించుకుని నీళ్లలో పడవేయడం, తండ్రి తాతలు మరణిస్తే జుట్టు తీయించుకోవడం మొదలైన ఆచారాల ఆంతర్యమిదేనంటారు.
Sunday, February 15, 2009
Subscribe to:
Post Comments (Atom)
సైంటిఫిక్ రీజన్ ఉంటే చెప్పండి అంతే గాని..! ఆచారాల పేరుతో తాలిబన్ల లాగ చెబితే ఎలా..? పలాన విధమే సరియైనదని ఏ ప్రామాణికంగా చెప్పగలరు..? ఎవరికి నచ్చినట్లు వారుంటారు.అంతే కాని ఆచారాలు అంటూ కట్టడి చేయడం అంత సబబు కాదేమో..!!..కమల్.
ReplyDelete